![]() |

సోషల్ మీడియాలో షణ్ముఖ్ జశ్వంత్ పేరు అందరికీ సుపరిచితమే. ఎన్నో వెబ్ సిరీస్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కరోనా తరువాత ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 5 లో షణ్ముఖ్ హౌస్ మెట్ గా వెళ్ళాడు. ఐతే అంతకు ముందు వరకు దీప్తి సునయనతో స్నేహంగా ఉండేవాడు. ఐతే అదే సీజన్ లో సిరి హన్మంత్ కూడా వెళ్ళింది. అక్కడ సిరితో చనువుగా ఉండడం చూసాక దీప్తితో షన్నుకి బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత ఈ ముగ్గురు ఎవరికీ వారు లైఫ్ లో మూవ్ ఆన్ ఇపోయారు. (Shanmukh Jaswanth)
ఇక రీసెంట్ గా షన్ను న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా ఒక అమ్మాయితో ఉన్న పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. ఐతే ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేది తెలీకుండా మేనేజ్ చేసాడు. #v అంటూ పోస్ట్ చేసాడు. హ్యాపీ బర్త్ డే V . గాడ్స్ ప్లాన్ అంటూ రాసుకున్నాడు అందులోనూ రెడ్ హార్ట్ సింబల్ కూడా వేసాడు. దాంతో నెటిజన్స్ అంతా షాకై మెసేజెస్ పెడుతున్నారు.
"పొద్దుపొద్దున్నే ఏంటి బ్రో మాకీ షాకు...అన్నాయ్ ఏంటి సర్ప్రైజ్ మాకు. అరేయ్ ఏంట్రా ఇది, పెళ్లి ఎప్పుడు బ్రో ఫాన్స్ అందరం రెడీగా ఉన్నాం. ఫైనల్లీ హ్యాపీ అన్నా..రెండో ప్రయాణం. కంగ్రాట్స్ షన్ను అన్నయ్య..ఎవరో జర చెప్పండయ్యా. టెన్షన్ తో పోయేలాగున్నం..కంగ్రాట్యులేషన్స్" చెప్తున్నారు.
ఐతే నెటిజన్స్ ఈ అమ్మాయి ఎవరు ఏంటి అంటూ వెతకడం మొదలుపెట్టారు. కొందరు అమ్మాయి పేరు వైష్ణవి అని కామెంట్స్ చేస్తున్నారు. మరి వైష్ణవి ఎవరు? ఆమెకి సినీ పరిశ్రమతో సంబంధముందా లేదా? అనేది తెలియాల్సి ఉంది.
https://www.instagram.com/p/DS_eF6fE1Mn/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
![]() |